రిలీజ్ కి సిద్ధం ఐనా మెగాహీరో సినిమా....!!

murali krishna
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  నటించిన లేటెస్ట్ మూవీ 'గాండీవధారి అర్జున'.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా రూపొందిన ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమా ఆగస్టు 25న ఈ మూవీ థియేటర్లలో ఎంతో గ్రాండ్ గా విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుంది. రీసెంట్ గా గాండీవధారి అర్జున సినిమా  ట్రైలర్‌ను విడుదల చేసారు మేకర్స్...ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సీక్వెన్స్‌లతో అదిరిపోయింది. యాక్షన్ సీన్లు, కారు చేజింగ్‍లతో ట్రైలర్ లో ఎంతో ఆసక్తికరం గా చూపించారు.. యాక్షన్ మోడ్‍లో హీరో వరుణ్ తేజ్ అదరగొట్టాడనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి పాత్రలో  సీనియర్ నటుడు నాజర్ ఎంతో అద్భుతంగా నటించినట్లు సమాచారం.ఆయన క్రిమినళ్లకు టార్గెట్‍గా ఉంటారు. 


ఆయనను కాపాడే బాధ్యతను ఓ ఏజెన్సీ తరఫున అర్జున్ (వరుణ్ తేజ్) చేపడతారు.. దేశం కోసం మరో మిషన్‍ను హీరో అర్జున్‍కు నాజర్ అప్పగిస్తారు. ఈ సినిమా ట్రైలర్‌లోని ఈ అంశాలన్నీ ఎంతో ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. ఈ చిత్రంలో హీరోయిన్ సాక్షి వైద్య కూడా యాక్షన్ పాత్రలోనే కనిపించింది. ఈ సినిమాకు ఫీల్ గుడ్ మ్యూజిక్  డైరెక్టర్ మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.ట్రైలర్ లో మిక్కి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. 


ఈ సినిమాలో సినిమాలో విమలా రామన్, వినయ్ రాయ్, రోషిణి ప్రకాశ్  తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.ఇదిలా ఉంటే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ పొందినట్లు హీరో వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పిక్ ను పోస్ట్ చేసారు. ఈ సినిమా వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి సినిమా విడుదలైన తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందోచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: