యువతని విరహంతో ముంచెత్తుతున్న రష్మీ ఫోజులు....!!
సుధీర్ పై రష్మీ వేసే కామెడీ పంచ్ లు కూడా బాగానే పేలుతుంటాయి. ఇదంతా రష్మీలో ఒక కోణం మాత్రమే. జబర్దస్త్ నుంచి సుధీర్ తప్పుకోవడంతో రష్మీ ఒంటరైపోయింది అంటూ ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇదంతా ఒకెత్తయితే.. ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది.లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది.
గ్లామర్ విషయంలో కూడా రష్మీ కేరింగ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగని రష్మీ ఓవర్ డోస్ గా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు.తాజాగా రష్మీ తనలోని అసలు సిసలైన బ్యూటీ యాంగిల్ ని బయట పెట్టింది. ట్రెడిషనల్ లుక్ లో రష్మీ అందం రెట్టింపు అయ్యిందా అన్నట్లుగా ఉంటుంది. తాజాగా రష్మీ అందమైన చీరకట్టులో మురిపించే ఫోజులు ఇచ్చింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రష్మీ హొయలు అదరహో అనిపిస్తున్నాయి.రష్మీ సోయగాలకు యువతలో తాపం పెరిగిపోతోంది అనే చెప్పాలి. జాబిలి వెన్నెల వెదజల్లినట్లు రష్మీ గ్లామర్ ఒలకబోస్తోంది. పైట ఎగరేస్తూ రష్మీ ఇస్తున్న ఫోజులు యువతని విరహంతో ముంచుతున్నాయి.