ఎన్టీఆర్ "రాఖీ" మూవీ రీ రిలీజ్ తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో ఇప్పటివరకు చాలా విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. అలా ఎన్టీఆర్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన వాటిలో రాఖీ మూవీ ఒకటి. ఈ మూవీ కి క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన గోవా బ్యూటీ ఇలియానా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి చార్మి హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.
 

ఇకపోతే ఈ సినిమా 22 డిసెంబర్ 2006 వ సంవత్సరం విడుదల అయింది. ఆ సమయంలో విడుదలై అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 30 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సింహాద్రి మూవీ రీ రిలీజ్ అయ్యి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకుంది. మరి మరి కొన్ని రోజుల్లో రీ రిలీజ్ కి రెడీగా ఉన్నా రాఖీ మూవీ ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: