గ్యాప్ వచ్చినా అనుష్క తగ్గేదేలే.. డబుల్ రెమ్యూనరేషన్?

praveen
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన అనుష్క శర్మ.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఆ తర్వాత అరుంధతి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇండస్ట్రీ మొత్తం అనుష్క వైపు చూసింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకొని.. సూపర్ హిట్లను ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే సాఫీగా సాగిపోతున్న కెరియర్ను చేజేతులారా పాడు చేసుకుంది ఈ సొగసరి.


 సైజ్ జీరో అనే సినిమా కోసం ఏకంగా ప్రయోగం చేసింది. ఈ సినిమా కోసం భారీగా బరువు పెరిగింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో సినిమాతో పేరు రాకపోగా ఇక బరువు తగ్గడానికి నానా తంటాలు పడింది. బరువు తగ్గకపోవడంతో చివరికి అవకాశాలు కూడా కనుమరుగయ్యాయి. కానీ అంతలోనే బాహుబలి లాంటి ఒక పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ రావడం ఈ సినిమా వరల్డ్ వైడ్ గా హిట్ కావడంతో అనుష్క క్రేజ్ మరింత పెరిగింది. కానీ ఆ తర్వాత మాత్రం ఎందుకో అనుష్కకు అస్సలు లక్ కలిసి రాలేదు. అనుష్క చేసిన భాగమతి తప్ప మిగతా సినిమాలు హిట్ కాలేదు.


 అయితే దాదాపు మూడేళ్ల తర్వాత అనుష్క నటించిన కొత్త సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించారు. మహేష్ బాబు.పి దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ సినిమాను నిర్మించింది. ఆగస్టులో సినిమా రిలీజ్ అని ముందుగా ప్రకటించినప్పటికీ.. సెప్టెంబర్ 7 కు రిలీజ్ ని వాయిదా వేశారు.  ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో అనుష్క రెమ్యూనరేషన్ కు సంబంధించిన వార్త ఒకటి వైరల్ గా మారిపోయింది. సాధారణంగా అనుష్క ఒక్కో సినిమాకి మూడు కోట్లు పారితోషికం తీసుకుంటుంది  కానీ మిస్ షట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు మాత్రం ఏకంగా ఆరు కోట్లు డిమాండ్ చేసిందట. అయితే అప్పటికే అనుష్కతో భాగమతి లాంటి బ్లాక్బస్టర్ చేసిన యువీ క్రియేషన్స్ అనుష్క అడిగినంత ఇచ్చినట్లు ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: