రూ.500 కోట్లతో రికార్డు సృష్టిస్తున్న రజనీకాంత్..!!
రోబో సినిమా తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయినా రజనీకాంత్ జైలర్ సినిమాతో ఒక్కసారిగా అభిమానులను ఆకట్టుకున్నారు. రజనీకాంత్ కంటే ముందు రూ .500 కోట్ల క్లబ్లో ప్రభాస్ మాత్రమే ఉన్నారు. బాహుబలి రెండు పార్టులతో రూ .500 కోట్ల మార్కును సాధించిన సౌత్ నుంచి ఇప్పటివరకు ఆ ఘనత ప్రభాస్ కు మాత్రమే ఉన్నది. అయితే ఈ ఘనతను ఇప్పుడు రజనీకాంత్ కూడా చేరుకోవడంతో అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఏది ఏమైనా ఇక రజనీకాంత్ పని అయిపోయింది అనుకుంటున్నా సమయంలో రజినీకాంత్ జైలర్ సినిమాతో కం బ్యాక్ ఇవ్వడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది.
రజనీకాంత్ ప్రస్తుతం పది రోజుల్లో రూ.560 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించినట్లు సమాచారం.. కోలీవుడ్లో ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాస్ వసూలు సాధించిన సినిమాగా కూడా నిలిచింది. తెలుగులో రూ .60 కోట్ల మార్కును దాటుకున్న ఈ సినిమా.. విడుదలైన అన్ని చోట్ల కూడా బాగానే కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటివరకు రూ .500 కోట్ల రూపాయలు రాబట్టిన సినిమా హీరోలలో అమీర్ ఖాన్ -4 సినిమాలు సల్మాన్ ఖాన్-3, సినిమాలు ప్రభాస్- 2, రజనీకాంత్ -2 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇంకా ఎన్ని కోట్లు జైలర్ సినిమా రాబడుతుందో చూడాలి.