డాన్ -3 దీపికా పదుకొనే.. నెక్స్ట్ లెవెల్లో యాక్టింగ్..!!

Divya
రన్విర్ సింగ్ డాన్ గా ఫర్హాన్ అక్తర్ డాన్ -3 చిత్రాన్ని ప్రకటించారు. వచ్చె ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే విధంగా డైరెక్టర్ ఫర్హాన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నట్లు సమాచారం. ఇందులో స్క్రిప్ట్ తో సహా ప్రతిదీ కూడా ప్రత్యేకంగా ఉండేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. హీరోయిన్గా రణవీర్ సరసన ఇప్పటికే చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి.. కృతి సనన్ ,కియార అద్వానీ ఇలా బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు చాలానే వినిపించాయి.. కానీ డైరెక్టర్ ఫర్హాన్ మనసులో మాత్రం ఒక హీరోయిన్ ఉన్నట్లు తెలుస్తోంది.


ఆమె ఎవరో కాదు హీరోయిన్ దీపికా పదుకొనే.. ఈమె అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలరని ఆస్థానంలో ఆమె తప్ప మరొకరు సెట్ కారని ఫర్హాన్ భావిస్తున్నట్టుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. స్టోరీ పరంగా ఇందులో హీరోయిన్ భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హీరోతో పాటు పోటీపడి ఈ పాత్రలలో నటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అథ్లెటిక్ బాడీ ఉన్న హీరోయిన్ అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలరని దీపికా పదుకొనేను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం..


ఇక వీరిద్దరూ నిజజీవితంలో కూడా భార్య భర్తలు కావడం చేత కెమిస్ట్రీ పరంగా కూడా డైరెక్టర్ కి పెద్దగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇంటిమేట్ సన్నివేశాలలో కూడా ఎలా నటించాలో డైరెక్టర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కాస్త ప్రవేసి కల్పిస్తే చాలు ఇద్దరు ఎలాంటి వాటినైనా పూర్తి చేస్తారు. అయితే దీపిక అయితేనే ఇందులో బాగుంటుందని ఫర్హాన్ చర్చిస్తున్నట్లు సమాచారం  మరి దీపికా యాక్షన్ చిత్రాలు నటించడం కొత్తేమీ కాదు గతంలో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఫర్హాన్ రుతిక్ రోషన్త ఫైటర్ అనే ఒక భారీ యాక్షన్ సినిమా అని సెలెకెక్కిస్తున్నారు ఈ సినిమా అయిపోయిన వెంటనే డాన్ -3 చిత్రం ఉండబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: