"కింగ్ ఆఫ్ కొత్త" మూవీ నుండి క్రేజీ అప్డేట్..!

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో దుల్కర్ సల్మాన్ ఒకడు. ఈయన ఇప్పటికే అనేక భాష సినిమాలో నటించి మంచి క్రేజ్ ను ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ నటుడు తెలుగు లో మహానటి ... సీత రామం మూవీ లలో నటించి ఈ రెండు మూవీ లతో కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు "కింగ్ ఆఫ్ కొత్త" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ఐశ్వర్య లక్ష్మి ... రితికా సింగ్ హీరోయిన్ లుగా నటించగా ... అభిలాష్ జోషి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఆగస్టు 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు.
 


ఇకపోతే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క బుకింగ్స్ ను ప్రపంచ వ్యాప్తంగా ఓపెన్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ బుకింగ్స్ కు ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా మలయాళ , తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ముఖ్యంగా మలయాళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: