పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు యూత్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇకపోతే పవన్ తన స్టైల్ తో ... తన ఆటిట్యూడ్ తో ... తన బాడీ లాంగ్వేజ్ తో ... డైలాగ్ డెలివరీతో కుర్రకారు ప్రేక్షకులను అలరించిన సినిమాలలో గుడుంబా శంకర్ మూవీ ఒకటి. 2004 వ సంవత్సరంలో మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోలేక పోయినప్పటికీ ఈ మూవీ లో పవన్ డ్రెస్సింగ్ స్టైల్ కి ... బాడీ లాంగ్వేజ్ కి మాత్రం అప్పటి కుర్రకారు ప్రేక్షకులు అద్భుతంగా ఫీదా అయ్యారు.
ఇకపోతే ఈ సినిమాకు వీర శంకర్ దర్శకత్వం వహించగా ... మీరా జాస్మిన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆశిష్ విద్యార్థి ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ కి మణిశర్మ అందించిన సంగీతం అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఇప్పటికి కూడా ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఇకపోతే ఆ సమయంలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయిన ఈ సినిమా ఆ తర్వాత బుల్లి.తెర ప్రేక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాని మరికొన్ని రోజుల్లో థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్ బుకింగ్స్ ను ఈ రోజు ఓపెన్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.