ఈ మధ్యకాలంలో ఆస్ట్రాలజర్ వేణు స్వామి పేరు సోషల్ మీడియాలో ఎంతలా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అక్కినేని
నాగ చైతన్య మరియు
సమంత విడాకులను ముందే ప్రకటించిన వేణు స్వామి చెప్పింది చెప్పినట్లుగానే వారిద్దరు విడాకులు తీసుకోవడంతో అప్పటినుండి ఈయన చెప్పింది కచ్చితంగా జరుగుతుంది అని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. ఇక దాని తర్వాత కూడా చాలామంది సినీ సెలబ్రిటీ జీవితాల గురించి ముందుగానే చెప్పే వేణు స్వామి ఆయన చెప్పింది చెప్పినట్టే జరగడంతో అందరూ షాక్ అవుతున్నారు.
పలువురు స్టార్
హీరోయిన్స్ సైతం తమ భవిష్యత్తును మార్చుకోవడానికి వేణు స్వామితో ప్రత్యేక పూజలను చేయించుకుంటున్నారు. ఇక ఆ లిస్టులోకి అందాల ముద్దుగుమ్మ
రష్మిక మందన
హీరోయిన్ నిధి అగర్వాల్ అందరు కూడా ఉన్నారు. ఇక
రష్మిక మందన వేణు స్వామి తో కలిసి పూజలు చేసిన తర్వాత ఆమె చేసిన సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేషనల్
క్రష్ గా కూడా తెచ్చుకుంది
రష్మిక మందన. ప్రస్తుతం ఒక్కో సినిమాకి ఐదు కోట్ల వరకు డిమాండ్ చేస్తుంది. ఇక ఆ తర్వాత పూజలు చేయించుకున్న నిధి అగర్వాల్
సైతం హిట్ ట్రాక్ ఎక్కినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల
నిధి అగర్వాల్ కి స్టార్
డైరెక్టర్ కాల్ చేసే మరీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక
టాలీవుడ్ రెబల్
హీరో ప్రభాస్ మరియు
మారుతి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో మూడవ
హీరోయిన్ గా సెలెక్ట్ అయింది . స్వయంగా
ప్రభాస్ నిధి అగర్వాల్ పేరుని సజెస్ట్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. ముందు
శ్రీ లీలాని అనుకున్నారట. ఇక
ప్రభాస్ మరియు ఆమెకి మ్యాచ్ అవ్వదు అని ఈమెని తప్పించే
నిధి అగర్వాల్ ని ఈ సినిమాలో ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వార్త విన్న వారందరూ వేణు స్వామి పూజలు ఫలించడం కారణంగానే
నిధి అగర్వాల్ కి అవకాశాలు వచ్చాయని అంటున్నారు..!!