సినిమాలకి బ్రేక్ ఇవ్వబోతున్న శ్రీ లీల.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.  రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయింది ఈ చిన్నది. ఇక మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ఆమెకి వరుస సినిమాల అవకాశాలు వచ్చాయి. దీంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. దాంతో ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా శ్రీ లీల నే తమ సినిమాలో హీరోయిన్ గా కావాలని డిమాండ్ చేస్తున్నారు.


 ఇక అలా అంతకంతకూ తన డిమాండ్ పెరగడంతో భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది ఈ అందాల తార. ఇక ఈమె ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సైతం సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ఇక తాజాగా స్త్రీ లీలకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక అదేంటంటే సినిమాలకి ఈ ముద్దుగుమ్మ సినిమాలకి బ్రేక్ ఇవ్వబోతుంది అన్న వార్తలు వినబడుతున్నాయి. ఇక ఈమె  చదువుకుంటూనే సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది.


ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ లాస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ సంవత్సరంలో తన డిగ్రీని పూర్తి చేయబోతోంది శ్రీ లీల. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె నవంబర్ డిసెంబర్ నెలలో తన ఎంబిబిఎస్ కి సంబంధించిన ఆఖరి పరీక్షలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఒక రెండు నెలల పాటు ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలన్నింటికీ కూడా బ్రేక్ ఇవ్వాలని గట్టి నిర్ణయం తీసుకుందట శ్రీ లీల. ఇక ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు విన్న దర్శక నిర్మాతలు టెన్షన్ తో తలలు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది .దాంతో ఈ వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: