మెగాస్టార్ బర్త్ డే నాడు కల్కి నుంచి అప్డేట్?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్‌ రెబల్ స్టార్ ప్రభాస్‌, బాలీవుడ్‌ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె జంటగా నటిస్తోన్న సినిమా 'కల్కి 2898 AD'. యంగ్ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశాపటానీ ఇంకా పశుపతి లాంటి దిగ్గజ నటీనటులు ఈ మూవీలో నటిస్తుండడంతో కల్కి మూవీపై భారీ అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటి దాకా రిలీజైన టైటిల్‌ గ్లింప్స్‌, ప్రభాస్‌ పోస్టర్లు ఫ్యాన్స్‌ను చాలా బాగా ఆకట్టుకున్నాయి.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌ నటించిన సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ సినిమాలు బోల్తాపడడంతో పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌ కల్కి మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో కల్కి నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి విషెస్ చెబుతూ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ప్రభాస్‌ కల్కి ఎడిటింగ్‌ రూమ్‌లోని ఓ వీడియోను టీం షేర్ చేసింది. ఇక ఇందులో ప్రభాస్ ఏదో గ్యాడ్జెట్‌ కోసం వెల్డింగ్‌ చేస్తూ  కనిపించాడు.ఎలా అంటే గ్యాంగ్‌ లీడర్‌ మూవీలో చిరంజీవి పోర్టబుల్ గ్యాస్ బర్నర్ మండిస్తూ ఎలా స్టైలిష్‌గా కనిపించాడో ఇప్పుడు అదే సీన్‌ని రీక్రియేట్ చేశారు కల్కి మేకర్స్‌.



ఇందుకు తగ్గట్టుగానే గ్యాంగ్ లీడర్ మ్యూజిక్‌ను యాడ్ చేసి వీడియోను రిలీజ్‌ చేశారు.ఇంకా ఈ సందర్భంగా కల్కి ఎడిటింగ్ రూమ్ నుంచి ఈ సీన్ లీక్ చేశామన్న మేకర్స్‌.. ఇక తాము కూడా చిరు లీక్స్ నుంచి స్ఫూర్తి పొందామన్నారు. ఈ వీడియోకు 'స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్స్ అండ్ ఎడిటింగ్ రూమ్ ఆఫ్ కల్కి 2898 ఏడీ' అనే క్యాప్షన్‌ ని మేకర్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. అటు మెగాభిమానులు ఇంకా ప్రభాస్‌ అభిమానులు ఈ వీడియోను చూసి తెగ ఖుషి అవుతూ తెగ లైక్స్ కొడుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి కూడా ఈ వీడియోపై స్పందించారు. కల్కి రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్ అంటూ ఆయన కామెంట్‌ పెట్టాడు. ఇక మెగాభిమానులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్‌ను తెగ ఖుషి చేస్తోన్న కల్కి ఎడిటింగ్‌ రూం వీడియోపై ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: