మహేశ్‌ బాబు వేసుకున్న ఈ సింపుల్ షర్ట్.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే?

praveen
అభిమానులు వాళ్ళకి నచ్చిన హీరో ఏ షర్ట్ వేస్తారు, ఏ టి-షర్ట్ వేస్తారు, అదే ట్రెండ్ ని ఫాలో అవ్వాలని చూస్తుంటారు. అభిమాన హీరోలు ఎలా ట్రెండ్ అవుతుంటారో ఫ్యాన్స్ కూడా అదే ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ కొన్నిసార్లు ఆ ధరలు చూస్తే మనకి దిమ్మతిరిపోతుంది. రాంచరణ్, ఎన్టిఆర్ వాచ్ లు ఒకప్పుడు బాగా ఫేమస్ అయ్యాయి. ఫ్యాన్స్ కూడా బాగున్నాయని గూగుల్ లో సెర్చ్ చేసి ధర చూసి షాక్ అయ్యారు. ఆ వాచ్ ల ధరలు కోట్లల్లో ఉన్నాయి. ప్రభాస్ వేసుకున్న చెక్స్ షర్ట్ కూడా వేళల్లో ఉండడం చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ వేసుకున్న షర్ట్ ధర వైరల్ అవుతుంది.

రీసెంట్ గా మహేష్ బాబు ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఎప్పటిలానే ఈ ప్రెస్ మీట్ కి మహేష్ సింపుల్ గా, హడావిడి లేకుండా ఒక బ్లాక్ కలర్ చెక్ షర్ట్ వేసుకొని అటెండ్ అయ్యారు. ఆ షర్ట్ అభిమానులకు చాలా నచ్చింది. ఇంకేముందు వెంటనే ఆ షర్ట్ ఎక్కడ దొరుకుంటుంది, ధర ఎంత అని సెర్చ్ చేయడం మొదలెట్టేసారు. ఆ ధర చూసిన అభిమానులు షాక్ అయ్యారు. సింపుల్ గా బ్లాక్ కలర్ చెక్స్ ఉన్న ఆ షర్ట్ ధర రూ. 18 వేలు. అయితే ఈ రేంజ్ దుస్తులను సెలెబ్రెటీలు వేసుకోవడం చాలా కామన్. కానీ ఒక సగటు వ్యక్తికి ఆ ధర అంటే కచ్చితంగా షాక్ కి గురిచేస్తుంది. మహేష్ బాబు సంపాదన కోట్లల్లో ఉంటుంది కాబట్టి ఈ రేంజ్ షర్ట్ లు వాళ్ళకి చాలా తక్కువ ధరే ఎన్ని చెప్పాలి. ఈ ధర చూసిన నెటిజన్లు అయ్యా మాకి ఇది ఒక నెల జీతం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మహేష్ బాబుకి ఇలా జరగడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా ఒకసారి మహేష్ డ్రెస్ పై చర్చ జరిగింది. మహేష్ బాబు సినిమాల్లో డ్రెస్సింగ్ కొంచెం సెపెరేట్ గా ఉంటుంది. సింపుల్ లుక్స్, డ్రెస్సింగ్ తోనే మహేష్ సినిమాల్లో కనిపిస్తారు. ఇక భరత్‌ అనే నేను చిత్రంలో మహేశ్‌ బాబు ధరించిన వైట్‌ షర్ట్‌ వైరల్ అయ్యింది. ఇక పోకిరి సినిమాలోని డ్రెస్సులు అదే పేరుతో మార్కెట్ లో సందడి చేసాయి. కొత్త ట్రెండ్ ని సెట్ చేసాయి. అప్పట్లో ఎక్కడ చూసిన ఆ డ్రెస్సులే కనిపించేవి. అభిమానులు ఆ డ్రెస్సులు ధరించి సందడి చేసేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: