దాన్ని చూపిస్తూ రెచ్చగొడుతున్న మహేష్ బాబు హీరోయిన్....!!

murali krishna
ఫార్టీ ప్లస్ లో కూడా భూమిక గ్లామర్ యాంగిల్ వదలడం లేదు. ఒకప్పటి ఈ హోమ్లీ హీరోయిన్ నాభి చూపిస్తూ రెడ్ డ్రెస్ లో సందడి చేసింది.1978 ఆగష్టు 23న జన్మించిన భూమిక 44వ ఏట అడుగుపెట్టింది. సన్నిహితులు, మిత్రుల మధ్య భూమిక జన్మదిన వేడుకలు జరిగాయి. భూమిక బర్త్ డే పార్టీకి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి సైతం హాజరైంది.భూమిక తన బర్త్ డే పార్టీలో రెడ్ ట్రెండీ వేర్ ధరించింది. సదరు డ్రెస్ లో నాభి చూపిస్తూ కాక రేపింది. భూమిక బర్త్ డే వేడుకల ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కామెంట్స్ తో అల్లడిస్తున్నారు.హీరోయిన్ గా రిటైర్ అయిన భూమిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. భూమిక ఎప్పుడూ వెండి తెరకు దూరంగా లేదు. తన వయసుకు తగ్గ రోల్స్ చేస్తూనే ఉంది. అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూ కొన్ని ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటిస్తుంది. గత ఏడాది భూమిక సీటీ మార్ చిత్రంలో గోపీచంద్ కు అక్క పాత్రలో నటించింది.

సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో భూమిక వెంకటేష్ కి జంటగా నటించడం విశేషం. ఆయన వెంకీ భార్య రోల్ చేశారు. గతంలో వీరిద్దరూ వాసు సినిమాలో నటించారు. కరుణాకర్ తెరకెక్కించిన వాసు మ్యూజికల్ హిట్ గా నిలిచింది.పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు భూమిక బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చారు. భూమిక యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి.గతంలో భూమికకు తన భర్తతో విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన ఫోటోస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో భూమిక తన భర్త భరత్ ఠాకూర్ తో కలసి ఉన్న రొమాంటిక్ స్టిల్స్ కూడా పోస్ట్ చేసింది.

నిర్మాత భరత్ ఠాకూర్ ని భూమిక 2007లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత భూమిక హీరోయిన్ రోల్స్ తగ్గించి.. క్యారెక్టర్ రోల్స్ లో నటిస్తోంది. టాలీవుడ్ లో భూమికకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తన వైవాహిక జీవితం ఒడిదుడుకులతో సాగినట్లు భూమిక గతంలో పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది భూమిక, భరత్ విడిపోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ వార్తలని భూమిక ఖండించింది. తన మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బందులు నిజమే అయినప్పటికీ తాము అన్నింటిని ఎదుర్కొంటూ అర్థం చేసుకుంటూ కలసి జీవిస్తున్నట్లు భూమిక ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: