పవన్ ఫ్యాన్ తో అడుగులు వేయబోతున్న వేణు శ్రీరామ్ !

Seetha Sailaja
ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ అనేకమంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆలిస్టులో బొమ్మరిల్లు భాస్కర్ శ్రీకాంత్ అడ్డాల వంశీ పైడిపల్లి లాంటి ప్రముఖ దర్శకులు చాలామంది ఉన్నారు. దిల్ రాజ్ తాను ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన తరువాత ఆదర్శకుడు తీసిన మూవీ ఫెయిల్ అయినప్పటికీ అతడికి మరొక అవకాశం ఇస్తూ ఉంటాడు ఆలిస్టులో వేణు శ్రీరామ్ ఒకడు.



‘ఓ మై ఫ్రెండ్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయిన వేణు శ్రీరామ్ మొదటి ప్రయత్నం ఫెయిల్ అయినప్పటికీ అతడిని నమ్మి దిల్ రాజ్  ‘ఎమ్ సీఏ’ మూవీ చేసే అవకాశం ఇచ్చాడు. ఆసినిమా సక్సస్ అయినప్పటికీ అతడికి మరొక సినిమా చేయడానికి సుమారు మూడు సంవత్సరాలు పట్టింది. పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ సినిమా చేసి సక్సస్ సాధించినప్పటికీ అతడికి మళ్ళీ అవకాశాలు రాలేదు.



అయితే ఇప్పుడు దిల్ రాజ్ మళ్ళీ వేణు శ్రీరామ్ కు అవకాశం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు దేవుడు ఇచ్చిన తమ్ముడుగా పేరు గాంచిన నితిన్ తో వేణు శ్రీరామ్ ఒక సినిమాను చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నట్లు టాక్. ‘వకీల్ సాబ్’ మూవీ తరువాత వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ తో ‘ఐకాన్’ మూవీ చేయడానికి చాల గట్టిప్రయత్నాలు చేశాడు. అయితే ఆ ఆశ నెరవేరలేదు.



ఆతరువాత పవన్ కళ్యాణ్ తో మరొక సినిమా తీయాలని ప్రయత్నించాడు ఆప్రయత్నాలు ముందుకు సాగలేదు. దీనితో పవన్ ఫ్యాన్ నితిన్ తో చేస్తున్న ఈప్రయత్నం ఎంతవరకు సక్సస్ ఇస్తుందో చూడాలి. ఈమధ్య కాలంలో అనేకమంది దర్శకులు తాము హిట్స్ సినిమాలు తీసినప్పటికీ వెంటనే మరొక సినిమా తీయలేకపోతున్నారు. వేణు శ్రీరామ్ కూడ అదే లిస్టులో ఉన్నప్పటికీ బిజీ డైరెక్టర్ గా మారాలి అని చేస్తున్న అతడి ప్రయత్నాలు ఎంతవరకు సక్సస్ అవుతాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: