బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిన "బిచ్చగాడు 2" మూవీ..!

Pulgam Srinivas
ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ "బిచ్చగాడు" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. బిచ్చగాడు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నటుడు ఆ తర్వాత నుండి తాను నటించిన అనేక సినిమాలను తెలుగు లో విడుదల చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఈయన బిచ్చగాడు 2 అనే మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఇకపోతే బిచ్చగాడు సినిమా అద్భుతమైన విజయం సాధించి ఉండడంతో తెలుగు సినీ ప్రేమికులు బిచ్చగాడు 2 మూవీ పై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.


అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ సినిమా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే స్టార్ మా చానల్లో ప్రసారం చేయనున్నట్లు ఆ ఛానల్ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.


మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సరసన కావ్య తప్పర్ హీరోయిన్ గా నటించింది. ఈ నటికి ఈ మూవీ ద్వారా పర్వాలేదు అనే స్థాయిలో గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ మూవీ తర్వాత విజయ్ "హత్య" అనే మరో మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: