డైరెక్టర్ అవ్వకముందు.. పూరి జగన్నాథ్ ఏం చేసేవాడో తెలుసా?
అంతేకాదు అది తక్కువ సమయంలోనే సినిమాను పూర్తి చేసి సూపర్ హిట్ కొట్టగల దర్శకుడు కూడా పూరినే అని ఎంతో మంది సినీ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇక పూరి జగన్నాథ్ మేకింగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.. ఆయన సినిమాలోని డైలాగ్స్ హీరోల క్యారెక్టర్ డిజైన్ చేసే విధానం యువతకి బాగా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడంటే పూరీ తీస్తున్న సినిమాలు పెద్దగా ఆడటం లేదు. కానీ ఒకప్పుడు తన సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేశాడు ఈ డైరెక్టర్. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి అనే సినిమాతో సూపర్ హిట్ సాధించిన పూరి తర్వాత మహేష్ తో పోకిరి చేసి ఇండస్ట్రీ హిట్టు కొట్టాడు.
ఇక ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పూరి జగన్నాథ్ డైరెక్టర్ అవ్వకముందు ఏం చేసేవాడు అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అయితే డైరెక్టర్గా అవతారం ఎత్తకముందు పూరి రచయితగా ఉండేవాడట. ఎంతోమంది దర్శకులకు కథలు రాసేవాడట. ఇలా కథలు రాయడానికి 100 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు పారితోషకం తీసుకునేవాడట. కథకు తగ్గట్టుగా షార్ట్ యానిమేషన్ బొమ్మలు కూడా గీసేవాడట. ఇలా బొమ్మలు గీసినందుకు 50 రూపాయలు అందుకునే వాడట పూరి జగన్నాథ్ ఈ విషయాన్ని ఇటీవల పూరినే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.