పుష్ప 2 కు ఆర్ ఆర్ ఆర్ సెంటిమెంట్ !

Seetha Sailaja
తెలుగు సినిమా ఇండస్ట్రి 69 సంవత్సరాల చరిత్రలో ఏ గొప్ప నటుడు  అందుకోలేకపోయిన జాతీయ అవార్డు అల్లు అర్జున్ కు దక్కడంతో ఇండస్ట్రిలోని ప్రతి నటుడు ఆ అవార్డు తమకు దక్కినట్లుగా  ఆనంద పడుతు ఉన్న పరిస్థితులలో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రి వర్గాలు జోష్ లో ఉన్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ కు అనేక అవార్డులు రావడంతో ‘పుష్ప 2’  జరగబోయే బిజినెస్ ఆకాశాన్ని అంటే స్థాయిలో ఉంటుంది అన్న సంకేతాలు వస్తున్నాయి.


ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశకు  చేరుకోవడంతో ఈ సీక్వెల్ కి సంబంధించిన కీలక ఎపిసోడ్స్  రష్మిక మందన్నతో పాటు ఇతర తారాగణం పై సుకుమార్ తీస్తున్నాడు. ఫహద్ ఫాసిల్ డేట్ల సర్దుబాటు పట్టి అతడికి  బన్నీతో ఉన్న కాంబినేషన్ సీన్లను టైం దొరికినప్పుడల్లా పూర్తి చేస్తున్నట్లు వార్తలు  వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ‘పుష్ప 2’ విడుదల తేదీని ఖరారు చేయడంలో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ సెంటిమెంట్ ప్రభావితం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  


తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీని వచ్చే ఏడాది మార్చి 22న  రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ డేట్ గత సంవత్సరం విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’  విడుదలైన మార్చి నెలను  సెంటిమెంట్ గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి రిలీజ్ డేట్ ను కార్నర్ చేయడానికి వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. మొదటి వారం వీకెండ్ కాగానే 25న ‘హోలీ’ వస్తుంది. 29న గుడ్ ఫ్రైడేతో కలిపి మరో పెద్ద వారాంతం కలిసి వస్తుంది అన్న పెద్ద వ్యూహం సుకుమార్ మనసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.    


ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించిన ఈ సినిమా దర్శక నిర్మాతలు ఒక నిర్ణయానికి  వచ్చారు కాబట్టి ఒక గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన మొదటి పాటను అక్టోబర్ లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పుష్య 1 జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చిన నేపధ్యంలో  ‘పుష్ప 2’ విషయంలో ఆస్కార్ అవార్డుల రేస్ లో ఈమూవీని నిలబెట్టాలని సుకుమార్ ఎలాంటి విషయంలోను రాజీ పడకుండా ఈమూవీని తీస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: