పాపం నాగబాబుకి.. టైం అస్సలు కలిసి రావట్లేదే.. ఇప్పుడు మరో దెబ్బ?
నాగబాబు తన కూతురు పెళ్లి ని ఎంత ఘనంగా.. అంగరంగ వైభవంగా జరిపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నిహారిక మాత్రం ఇలా పెళ్లయిన కొన్నాళ్లకే చివరికి భర్తతో విడాకులు తీసుకుని విడిపోయింది. ఎన్నో రోజులపాటు నిహారిక విడాకుల గురించి వార్తలు రాగా.. ఇటీవల ఒకవైపు నిహారిక మరోవైపు చైతన్య విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇలా నిహారిక విడాకుల ద్వారా అటు నాగబాబుకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. అయితే ఇప్పుడు కొడుకు వరుణ్ తేజ్ నుంచి మరో షాక్ తగిలింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఫిక్స్ అయింది. మరికొన్ని రోజుల్లో మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగపోతున్నాయి అని అందరూ సంతోషంలో మునిగిపోయారు.
నిహారిక విడాకుల బాధ నుంచి అటు నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లి ద్వారా బయటపడతారని అందరూ అనుకున్నారు. కానీ అంతకుముందే నాగబాబు కు మరో ఎదురు దెబ్బ తగిలింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గాండీవ దారి అర్జున డిజాస్టర్ టాక్ నమోదు చేసుకుంది. దీంతో సోషల్ మీడియాలో మెగా హేటర్స్ అందరూ మరోసారి రెచ్చిపోతున్నారు. చిరంజీవి కొడుకు రాంచరణ్ ఎదిగిపోతున్నాడు. రీసెంట్గా అల్లు అరవింద్ కొడుకు బన్నీ జాతియా అవార్డు అందుకున్నారు. పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. అందురూ బాగానే ఉన్న మెగా ఫ్యామిలీలో నాగబాబు ఫ్యామిలీ మాత్రం రోజు రోజుకు డౌన్ పాల్ అయిపోతుందని ఎంతోమంది ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.