ఈ సంవత్సరం ఇప్పటివరకు మెగా హీరోలా బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఇదే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం ఇప్పటికే మెగా హీరోలు నటించిన చాలా సినిమాలు థియేటర్ లలో విడుదల అయ్యాయి. అందులో ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయో తెలుసుకుందాం.

ఈ సంవత్సరం మొదటగా మెగా ఫ్యామిలీ నుండి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్టేరు వీరయ్య సినిమా విడుదల అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయి రేంజ్ విజయాన్ని అందుకొని ప్రపంచ వ్యాప్తంగా 46 కోట్ల లాభాలను అందుకుంది. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహించగా ... శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

సినిమా తర్వాత మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన విరూపాక్ష సినిమా విడుదల అయింది. ఈ సినిమా కూడా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని 25 కోట్ల లాభాలను అందుకుంది. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది.

మూవీ తర్వాత మెగా ఫ్యామిలీ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా రూపొందిన "బ్రో" అనే మూవీ విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలం అయింది. దానితో ఈ మూవీ కి 31 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.

మూవీ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ భారీ డిజాస్టర్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ కి 52 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇకపోతే తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గాండీవదారి అర్జున మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో ... ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: