వామ్మో.. కాంతారా-2కి.. అంత భారీ బడ్జెట్టా?
దీంతో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని అటు మేకర్స్ కూడా నిర్ణయించారు. ఇక సీక్వెల్ అనౌన్స్ చేయగానే ఇక కాంతార పార్ట్ 2 పై అందరిలో అంచనాలు కూడా పెరిగిపోయాయి. అయితే మొదటి పార్ట్ సూపర్ హిట్ సాధించి భారీగా లాభాలు తెచ్చి పెట్టడంతో ఇక సీక్వల్ కోసం ముందుగా అనుకున్న దాని కంటే భారీగా బడ్జెట్ కేటాయించారట మేకర్స్. కన్నడ రూట్స్ కు సంబంధించిన కథతో తెరకెక్కిన ఈ సినిమా నేషనల్ ఆడియోస్ కు బాగా కనెక్ట్ అయింది. దీంతో సినిమాకు సీక్వెల్ కావాలని ఎంతోమంది ఫాన్స్ కూడా రిక్వెస్ట్ చేసారు. దీంతో ఫాన్స్ కోరిక మేరకు అటు పార్ట్ 2 కూడా అనౌన్స్ చేసారు మేకర్స్.
అయితే కాంతారా బడ్జెట్ కేవలం 16 కోట్లు మాత్రమే కానీ ఇప్పుడు పార్ట్ 2 బడ్జెట్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారట మేకర్స్. ఏకంగా కాంతారా మొదటి పార్ట్ 400 కోట్ల సాధించడంతో ఇప్పుడు రెండో పార్ట్ కు 120 కోట్లతో నిర్మించేందుకు రెడీ అయ్యారట దర్శకనిర్మాతలు. ఇక త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకువెళ్లేందుకు కసరత్తులు కూడా చేస్తున్నారు. అయితే 2024 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. 16 కోట్లతో తీస్తేనే అంత అద్భుతంగా వచ్చింది.. ఇప్పుడు 120 కోట్లు అంటే ఇంకా ఎంత అద్భుతంగా ఉండబోతుందో అనే అభిమానుల్లో కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి.