ఉత్తమ చిత్రంగా ఉప్పెన సినిమాని సెలెక్ట్ చేయడం కరెక్టేనా..?

Divya
ఎంతో ప్రతిష్టాత్మకంగా 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగు సినిమాలు సైతం సత్తా చాటిన సంగతి తెలిసిందే ఏకంగా 10 పురస్కారాలతో తెలుగు సినిమా స్థాయిని మరొక లెవెల్ కి తీసుకువెళ్లారు. అయితే కొన్ని సినిమాలకు జాతీయ అవార్డు రావడంతో పలువురు నెటిజెన్స్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ ఏడాది విడుదలైన సినిమాలలో చాలా సినిమాలు ఉన్నాయి. 2021 లో విడుదలైన ఉప్పెన సినిమాకి నేషనల్ అవార్డు ప్రాంతీయ మూవీ గా రావడంతో పలు రకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఆఫ్టర్  కోవిడ్ సమయంలో థియేటర్లకు ఆడియన్స్ వస్తారా లేదా అనే విషయంపై సందిగ్ధంగా ఉన్న సమయంలో ఉప్పెన సినిమా విడుదలై దాదాపుగా 100 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి.. ఆ తర్వాత వచ్చే ప్రతి సినిమాకి కూడా ఊపిరి పోసింది ఈ చిత్రం. ఉప్పెన సినిమా ఇప్పుడు నేషనల్ అవార్డులో కూడా సత్తా చాటింది. అందమైన ప్రేమ కథాంశ చిత్రంతో తెరకెక్కించిన ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రం నేషనల్ అవార్డును సాధించింది. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించగా మెగా హీరో వైష్ణవ తేజ్ ,కృతి శెట్టి హీరోయిన్గా నటించారు.


తన తోలి  సినిమాతోనే  రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిన వైష్ణవ తేజ్ ఈ సినిమాలో లవ్ ఎమోషన్ స్టార్స్ నెక్స్ట్ లెవెల్ లో మ్యూజిక్ అన్నీ కూడా బాగుండడంతో ఈ సినిమా హిట్ అయింది. అయితే 2021 అవార్డుల సినిమాలలో RRR, పుష్ప, శ్యామ్ సింగరాయ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నప్పటికీ ఉప్పెన సినిమాకే తెలుగులో నుంచి ప్రాంతీయ చిత్రంగా రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు  ఈ సినిమా కంటే ఆ సినిమాలు చాలా కథ  పరంగ ఎమోషనల్ పరంగా అన్ని బాగానే ఉన్నప్పటికీ  తెలుగు ఉత్తమ చిత్రం ఎలా అయ్యిందో ఉప్పెన సినిమా అంటూ అర్థం కావడం లేదని పలువురు నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: