సునీల్ అనుభవాలను పట్టించుకోని వెన్నెల కిశోర్ !
ప్రస్తుతం రానురాను తెలుగు సినిమాల్లో కామెడీ డోస్ తగ్గిపోతున్న సమయంలో వెన్నెల కిషోర్ ఉన్నాడంటే కనిపించినంత సేపు నవ్వులు గ్యారెంటీ అనే భరో ససగటు ప్రేక్షకులకు కలుగుతోంది. మంచి కామిడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ గా పేరు గాంచిన వెన్నెల కిశోర్ రేంజ్ కి తగ్గ పాత్రలు అతడికి ప్రస్తుతం ఇవ్వడం లేదు అన్నకామెంట్స్ ఉన్నాయి. సరైన పాత్ర ఇస్తే కిషోర్ ఎలా చెల రేగిపోతాడో ‘సామజవరగమన’ లాంటి సినిమాలు రుజువు చేశాయి.
ఈపరిస్థితుల మధ్య వెన్నెల కిషోర్ ఏకంగా హీరో అయిపోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. అతను లీడ్ రోల్లో ‘చార్లీ 111’ అనే సినిమాను లేటెస్ట్ గా ప్రకటించారు. ఒక యానిమేటెడ్ వీడియోతో వెన్నెల కిషోర్ పాత్రకు ఇంట్రో ఇస్తూ సినిమాను అనౌన్స్ చేసిన తీరు సోషల్ మీడియాలో చాలామంది దృష్టిని ఆకర్షించింది. ‘చార్లీ 111’ లో తాను కన్ఫ్యూజ్ అయి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ఒక కన్ఫ్యూజుడు ఏజెంట్ పాత్రలో వెన్నెల కిషోర్ కనిపించబోతున్నాడు.
ఈ వీడియో చూసిన వారికి ఈ సినిమా ప్రేక్షకులు కడుపు చెక్కలయ్యేలా నవ్వులు పంచడం గ్యారెంటీ అన్నసంకేతాలు ఇస్తోంది. గతంలో సునీల్ టాప్ కొమెడియన్ గా ఒక వెలుగువెలుగుతున్న రోజులలో హీరోగా మారిన విషయం తెలిసిందే. అయితే హీరోగా విజయాలు చూసిన సునీల్ ఆతరువాత భయంకరమైన ఫ్లాప్ లను ఎదుర్కున్న విషయం తెలిసిందే. హీరోగా అతడికి అవకాశాలు తగ్గి పోవడంతో సునీల్ తిరిగి యూటర్న్ తీసుకుని మళ్ళీ కమేడియన్ గా ఆతరువాత విలన్ గా సెటిల్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు ఎదురు చూసిన నేపధ్యంలో వెన్నెల కిశోర్ సాహసం ఎంతవరకు అతడిని హీరోగా నిలపెడుతోందో చూడాలి..