అందరికీ వస్తున్నాయ్.. కానీ జక్కన్న హీరోలకే నేషనల్ అవార్డ్స్ ఎందుకివ్వరూ?
ఇక కలెక్షన్ల విషయంలో ఎన్నో రికార్డులు కొల్లగొడుతూ ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటాయి జక్కన్న సినిమాలు. అంతేకాదు దేశాలు దాటి అభిమానులను సంపాదించుకుంటూ ఉంటారు జక్కన్న హీరోలు. కానీ ఇప్పటివరకు నేషనల్ అవార్డ్స్ జ్యురీ మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. రాజమౌళి సినిమాల్లో నటించిన హీరోలు నటనలో విశ్వరూపం చూపించడం చేస్తూ ఉంటారు. కానీ ఏ హీరోకి ఇప్పటివరకు నేషనల్ అవార్డు రాలేదు. ఏడేళ్లు బాహుబలి కోసం కష్టపడిన ప్రభాస్ కి వసూళ్ళలో రికార్డు కొట్టాడు తప్ప నేషనల్ అవార్డు దక్కలేదు.
ఇక ప్రభాస్ కి కాకపోయినా బల్లాల దేవా పాత్రలో నటించి విశ్వరూపం చూపించిన రానాకి అయినా అటు నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్న అదీ జరగలేదు. ఇక శివగామి పాత్రలో పవర్ఫుల్ నటనతో ఆకట్టుకున్న రమ్యకృష్ణ కి నేషనల్ అవార్డు వరించలేదు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ గెలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు వంక పెట్టె ఛాన్సే లేదు. ఇక ఇద్దరు పాత్రలకు ప్రాణం పోశారు. అయినా నేషనల్ అవార్డు మాత్రం వీరిని వరించలేదు. అయితే రాజమౌళి సినిమాలో ఇలా కలెక్షన్స్ విషయంలో అదరగొడుతున్న.. ఎందుకో జక్కన్న హీరోల పిల్లలకు నేషనల్ అవార్డు రావడం లేదు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.