బన్నీకి టఫ్ ఫైట్ ఇచ్చిన హీరో.. కొద్దిలో నేషనల్ అవార్డు మిస్సయ్యేది?
ఇటీవలే నేషనల్ అవార్డ్స్ ప్రదోనోత్సవం లో భాగంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో నటనకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో టాలీవుడ్ నుంచి ఇలా నేషనల్ అవార్డు అందుకున్న మొదటి హీరోగా చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్. అయితే ఇలాంటి జాతీయ అవార్డును ఎలాంటి కాంపిటీషన్ లేకుండానే గెలుసుకున్నారా అంటే.. అలా ఎలా కుదురుతుంది. హెవీ కాంపిటీషన్ లోనే అల్లు అర్జున్ నేషనల్ అవార్డును కైవసం చేసుకున్నాడు.
ఏకంగా ఒక బాలీవుడ్ హీరో తో నెక్ టు నెక్ ఫైట్ తర్వాతే మన ఐకానిక్ స్టార్ కు ఈ ప్రెస్టీజీయస్ అవార్డు దక్కింది అని చెప్పాలి. జై భీమ్ హీరో సూర్య, కర్ణన్ హీరో ధనుష్, సార్పట్టా హీరో ఆర్య వీరందరూ ఈ అవార్డు రేసులో ఉన్నవారే. తప్పకుండా అవార్డు తమకే వస్తుందంటూ ఎక్స్పెక్ట్ చేసినవాళ్లే. అయితే వీళ్లందరిని దాటి మెప్పించిన అల్లు అర్జున్ ఒక హీరో దగ్గర మాత్రం ఆగిపోయారు. అతడే బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్. సర్దార్ వృద్ధం సింగ్ తో 2021 లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ హీరో.. తన యాక్టింగ్ తో ట్రాన్స్ఫర్మేషన్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇంతకు మించిన బెస్ట్ యాక్టర్ ఇంకొకరు లేరు అనే టాక్ వచ్చేలా చేసుకున్నాడు. అలాంటి విక్కీ కౌశల్ అటు నేషనల్ అవార్డ్స్ ప్రదనోత్సవంలో అల్లు అర్జున్ కి గట్టి పోటీ ఇచ్చాడు. కానీ ఇక ఈ పోటీ మధ్య అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు దక్కింది.