అదాశర్మ సుశాంత్ చనిపోయిన ఫ్లాట్ కొనడానికి.. కారణం అదేనట?
అయితే ఇక తర్వాత కూడా ఎంతో మంది హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మా. కానీ ఎందుకో సినిమాల ద్వారా టాలీవుడ్ లో అనుకున్న గుర్తింపును మాత్రం సంపాదించలేదు. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ వెబ్ సిరీస్ లు సినిమాలు అంటూ మంచి అవకాశాలు అందుకుంటుంది. అయితే ఇటీవల ఆదా శర్మ చేసిన ఒక పని అందరిని షాక్ కి గురి చేసింది అన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్ ని ఆదాశర్మ కొనుగోలు చేసింది.
అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ ఫ్లాట్ ని వేరొకరు కొనుగోలు చేయడం కానీ కనీసం అందులో అద్దెకు దిగడం గాని చేయలేదు. సుశాంత్ మరణం తర్వాత ఆ ఫ్లాట్ మూత పడింది అని చెప్పాలి. కానీ అలాంటి ఫ్లాట్ ని ఇప్పుడు హీరోయిన్ ఆదాశర్మ కొనుగోలు చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే ఎందుకు ఆదాశర్మ ఏరి కోరి సుశాంత్ చనిపోయిన ఫ్లాట్ నే కొనుగోలు చేసింది అనేది ఇంకా బయటికి రాలేదు. అయితే కావాలనే ఈ హీరోయిన్ ఆ ఫ్లాట్ ని కొనుగోలు చేసిందట. సుశాంత్ అభిమానులను తన వైపుకు తిప్పుకోవడానికి.. ఇలా చేసిందని కొంతమంది చర్చించుకుంటూ ఉండటం గమనార్హం. అంతేకాదు మరికొంతమంది ఆమెకు ఆ ఇల్లు చీప్ గా వచ్చిందని అందుకే కొనుగోలు చేసిందని అనుకుంటున్నారట.