ఏంటి.. శ్రీ లీలకి రామ్ తో ఇది మొదటి సినిమా కాదా..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని మరియు యంగ్ సెన్సేషన్ శ్రీ లీల నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. శ్రీనివాస  సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ శ్రీకాంత్ ప్రిన్స్ గౌతమి తదితరులు కీలక పాత్రలు కనిపించబోతున్నారు. దాంతోపాటు బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతుల ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది. కాగా సెప్టెంబర్ 15 న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ కన్నడ మలయాళం హిందీ వంటి భాషల్లో కూడా గ్రాండ్గా విడుదల కాబోతోంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ని శరవేగంగా జరుపుతున్నారు చిత్ర యూనిట్. అయితే శనివారం సాయంత్రం స్కందా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు చిత్ర యూనిట్. స్పెషల్ గెస్ట్ గా ఆనందమూరి బాలకృష్ణ వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే .దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. కాగా ఈ ఈవెంట్లో శ్రీ లీలా మాట్లాడుతూ ఒక సీక్రెట్ నీలో రియల్ చేయడంతో అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఇంతవరకు రామ్ శ్రీ లీల జంటగా మొదటిసారి స్కందని సినిమాలో కనిపించబోతున్నారు అని అందరూ అనుకున్నారు.

కానీ ఈ విషయంలో స్త్రీలు ఒక ట్రస్ట్ ఇచ్చిందే రామ్ తో స్కంద తనకి మూడవ సినిమా అంటూ ఇందులో భాగంగా పేర్కొంది. అయితే ఇంతకుముందు  రామ్ హీరోగా వచ్చిన రెండు సినిమాలు స్త్రీలకి హీరోయిన్గా చేసే అవకాశం వచ్చిందిట. కానీ ఏవో కారణాలవల్ల తను ఆ సినిమాలో నటించలేకపోయింది. కాగా మూడవ అవకాశం మాకు స్కంద సినిమాతో వర్కౌట్ అయ్యింది అని మూడు నా లక్కీ నెంబర్ అందుకే వర్క్ అవుట్ అయింది కావచ్చు అని శ్రీ లీలా ఇందులో భాగంగా చెప్పుకొచ్చింది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: