బోయపాటి సెంటిమెంట్ రామ్ బ్రేక్ చేయగలడా !
సగటు కమర్షియల్ ఫార్ములాను నమ్ముకుని మాత్రమే ఇతడు సినిమాలు తీస్తున్నాడు అని కొందరంటారు. నందమూరి బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గ సినిమాలు తీయడంలో ఇతడు సిద్ధ హస్థుడు కావడంతో ఇప్పటికీ ఇతడి హవా నడుస్తోంది అన్నకామెంట్స్ కూడ ఉన్నాయి. బాలయ్యతో బోయపాటి తీసిన ‘అఖండ’ తరువాత రామ్ తో తీసిన ‘స్కంద మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది.
అయితే బాలయ్యతో బోయపాటిల కాంబినేషన్ సింక్ అయినట్లుగా బోయపాటి మిగతా హీరోలతో చేసిన సినిమాలు హిట్ కాలేకపోతున్నాయి. అల్లు అర్జున్ తో తీసిన ‘సరైనోడు’ డివైడ్ టాక్ ను తట్టుకుని వసూళ్లు సాధించనప్పటికి దర్శకుడిగా అతడి గ్రాఫ్ పెరగలేదు. ఆతరువాత రామ్ చరణ్ తో తీసిన ‘వినయవిధేయ రామ’ భారీ ఫ్లాప్ బెల్లం కొండ శ్రీనివాస్ తో తీసిన ‘జయ జానకి నాయక’ కూడా ఫ్లాప్ లిస్ట్ లోకి చేరిపోయింది.
దీనితో బోయపాటి కేవలం బాలయ్యతో మాత్రమే సూపర్ హిట్స్ తీయగలడు అన్న అభిప్రాయం టాప్ హీరోలలో ఏర్పడింది అంటారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రామ్‌తో బోయపాటి తీసిన ‘స్కంద’ మూవీ ప్రోమోలు మరీరొటీన్ గా ఉన్నాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు రామ్‌తో మరీ ఎక్కువ వయలెన్స్ చేయించడం ఎంతవరకు సగటు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అన్నసందేహాలు కొందరికి వస్తున్నాయి. దీనితో బాలయ్యకు అప్లై చేసిన ఫార్ములాని మిగతా హీరోలకు కూడ అప్లై చేస్తే మరీ అతిగా అనిపిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..