నందమూరి వేడుకకు తారక్ దూరంగా ఉండడానికి.. కారణం అదేనా?
దీంతో ఇక తన తాతగారి వేడుకకు తారక్ అసలు ఎందుకు దూరంగా ఉన్నారు అంటూ ఒక చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన యాక్సిడెంట్ సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతుంది. అయితే తాను ₹100 నాణెం విడుదల వేడుకకు రావడం కొంతమందికి ఇష్టం లేకపోవడంతోనే.. చివరికి ఈవెంట్ కు ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు అంటూ ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే తారక్ మాత్రం ఎందుకు ఆ ఈవెంట్ కు హాజరు కాలేదు అనే విషయంపై ఎలాంటి అధికారిక క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.
ఇకపోతే త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్.. ఇక తన కెరీర్ను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. కాగా ఇప్పటికే మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఒక్కో ఏడాదికి ఒక్కో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా కెరియర్ ప్లానింగ్ చేసుకున్నాడు. కాగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో నటిస్తూ ఉండగా మరికొన్ని సినిమాలకు సంబంధించి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. అయితే పారితోషకం కూడా భారీ రేంజ్ లో పెంచేసిన తారక్ మరోసారి రాజమౌళితో సినిమాకు రెడీ అవుతున్నాడు అంటూ ఒక భోగట్ట.