మూవీ లవర్స్ కి ఈసారి సంక్రాంతి సూపర్?

Purushottham Vinay
ఈసారి మాత్రం సంక్రాంతికి టాలీవుడ్ లో సినిమాల జాతర మాములుగా ఉండదు. స్టార్ హీరోలు, క్రేజీ ప్రాజెక్ట్స్ ఇంకా అలాగే డిఫరెంట్ జోనర్స్ తో పలు సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.అయితే వీటిలో ముందుగా మాట్లాడుకోవాల్సిన సినిమా మాత్రం ప్రభాస్ చేస్తున్న హై బడ్జెట్ పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో మూవీ కల్కి. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమాని జనవరి 12న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా పోస్ట్‌పోన్ అవ్వొచ్చని టాక్ మాత్రం చాలా ఎక్కువగా వినిపిస్తుంది.ఇక అలాగే ఈ మూవీతో పాటు మరో సూపర్ హీరో సినిమా కూడా సంక్రాంతి బరిలో పోటీ పడబోతోంది. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘హనుమాన్’.ఇప్పటికే రిలీజ్ కావాల్సిన మూవీ గ్రాఫిక్స్ వర్క్ లేట్ అవ్వడంతో జనవరి 12కి ఈ సినిమా వాయిదా పడింది. మరి ఆ డేట్ కి అయినా వస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.



ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో చిత్రం గుంటూరు కారం.ఈ సినిమా షూటింగ్ కూడా చాలా లేట్ అవుతూ వస్తున్నప్పటికీ.. జనవరి 12 కచ్చితంగా వస్తామని సూపర్ స్టార్ మహేష్ చెబుతున్నారు.మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఈగల్’ డేట్ అనౌన్స్ చేయనప్పటికీ సంక్రాంతికే వస్తామంటూ ప్రకటించారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. అలాగే గీతగోవిందం వంటి బ్లాక్ బస్టర్ తరువాత విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమాని నిర్మాత దిల్ రాజు కచ్చితంగా సంక్రాంతి పండగ బరిలో నిలబెడతాను అని చెబుతున్నాడు. అయితే డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. తాజాగా ఈ సంక్రాంతి రేసులోకి కింగ్ నాగార్జున 'నా సామిరంగ' చిత్రం వచ్చి చేరింది. అయితే ఇది కూడా కచ్చితంగా తేదీ ప్రకటించలేదు. పండక్కి వస్తామంటూ వీరంతా ప్రకటించినప్పటికీ ప్రతి ఒక్కరి దగ్గర కచ్చితమైన కన్ఫర్మేషన్ అనేది లేదు. కానీ పండక్కి రిలీజ్ అయితే ఖచ్చితంగా మూవీ లవర్స్ కి పెద్ద పండగే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: