యంగ్ హీరోలకు చుక్కలు చూపెడుతున్న స్టార్ హీరోయిన్స్ !

Seetha Sailaja
ఈవారం విడుదల కాబోతున్న ‘ఖుషీ’ వచ్చేవారం విడుదల కాబోతున్న ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ ఈ రెండు సినిమాలు డిఫరెంట్ కథలతో వస్తున్న పరిస్థితులలో ఈ రెండు మూవీల పై సగటు ప్రేక్షకులలో అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలలో హీరోలుగా నటించిన విజయ్ దేవరకొండ నవీన్ పోలిశెట్టి లకు స్టార్ హీరోయిన్స్ సమంత అనుష్క లు చూపించడంతో ఈ యంగ్ హీరోలు ఇద్దరు ఒకే రకమైన సమస్యలు ఎదుర్కోవడం కామన్ టాపిక్ గా మారింది.


‘ఖుషీ’ ప్రారంభం అయి ఎంతోకాలం అయింది. మధ్యలో సమంతకు అనారోగ్య సమస్యలు ఏర్పడటంతో ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వడానికి చాల సమయం పట్టింది. ఈసినిమాలోని పాటలు విపరీతంగా హిట్ అయినప్పటికీ ఆ పాటల మ్యానియాకు తగ్గట్టుగా ఈ మూవీని ప్రమోట్ చేయలేకపోయారు అన్న కామెంట్స్ వస్తున్నాయి.


ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన సమంత ఆతరువాతా వెంటనే ఆమె అమెరికాకు వెళ్లిపోవడంతో ఈ మూవీ ప్రమోషన్ బాధ్యత అంతా విజయ్ దేవరకొండ పై పడింది. అతడు ఏఐనిమాను ప్రమోట్ చేస్తున్నప్పటికీ ఇంటర్వ్యూలలో సమంత లేకపోడంతో పెద్దగా ఆ ప్రమోషన్ కార్యక్రమాలు సక్సస్ కాలేదు అన్నమాటలు వినిపిస్తున్నాయి.


వచ్చే వారం విడుదల కాబోతున్న ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ సినిమా పరిస్థితి కూడ ఈవిధంగానే ఉంది. ఈసినిమాను ప్రమోట్ చేస్తూ నవీన్ పోలిశెట్టి కాలేజీలకు వెళ్ళి ప్రమోట్ చేస్తున్నాడు. అయితే కనీసం ఈసినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడ ఏర్పాటు చేయలేని పరిస్థితి అని అంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కు ఏవిధంగాను అనుష్క సహకరించడంలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా అనుష్క వ్యవహరించడానికి స్పష్టమైన కారణాలు తెలియవు. దేనితో ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ ఉన్న ఈ రెండు సినిమాలు హీరోయిన్స్ సహకరించకపోవడంతో యంగ్ హీరోలు ఇబ్బంది పడుతున్నారు అంటూ ఇండస్ట్రీలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: