బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో స్టార్ట్ కావడానికి సిద్ధంగా ఉంది. ఎంతో ఆసక్తిగా రాబోతున్న ఈ రియాలిటీ షో ఆదివారం ప్రారంభం కాబోతోంది. అయితే ఇప్పటివరకు ఈసారి హౌస్ లోకి రాబోతున్న కంటెస్టెంట్ లపై ఎటువంటి క్లారిటీ లేదు. తాజాగా ఒక బ్యాడ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియా హాట్ మామ్ అండ్ డాటర్ జోడి సురేఖ వాణి మరియు సుప్రీత ఇందులో రావడం లేదు అన్న వార్తలు వినబడుతున్నాయి . ఇక ఈ వార్త నిజంగానే అభిమానులను నిరాశకి గురి చేసే వార్త అని చెప్పాలి. అయితే ఈ ఇద్దరు తల్లి కూతుర్లు బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నారు అన్న వార్తలు చాలా కాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఇక సోషల్ మీడియాలో తమ హాట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ సందడి చేసే సురేఖ వాణి మరియు సుప్రీత హౌస్ లోకి వస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది అని ఇప్పటివరకు ఈ వార్త తెలిసిన వారందరూ చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ చివరి నిమిషంలో వీళ్ళిద్దరూ రాకూడదు అని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళు తప్పుకోవడానికి కారణం ఏంటి అన్నది మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే మొదట్లో తమకు అసలు బిగ్ బాస్ నుంచి ఆఫర్ రాలేదని వీళ్ళు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి .
ఎటువంటి నెగటివ్ ఇమేజి వస్తుందో అన్న భయంతో ఈ తల్లి కూతుర్లు ఇద్దరు షోకి రావడానికి నో చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఎప్పటి వరకు బిగ్ బాస్ షోలో పాల్గొన్న సెలబ్రిటీలు పాజిటివ్ గా కంటే నెగిటివ్ గానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చారు. మరోవైపు ఇప్పటికే ఏడవ సీజన్ కంటెస్టెంట్ల లిస్ట్ మొత్తాన్ని బిగ్ బాస్ హౌస్ టీం ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. కొంత కాలం గా వినిపిస్తున్న పేర్లలో కొందరు లేకపోవడం మరికొందరు ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేయడం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది . ఎప్పటిలాగే ఈ షోని చాలా గ్రాండ్గా లాంచ్ చేసే సమయం వరకు కంటెస్టెంట్ల పేర్లను చాలా గోప్యంగా ఉంచుతారు. ఇక ఈసారి ఉల్టా పుల్టాగా ఉండబోతున్న బిగ్బాస్ సీజన్ ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి అందరిలో నెలకొంది..!!