మొదటిసారి పుష్ప 2 మూవీ రిజల్ట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ఇటీవల ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన 69వ జాతీయ అవార్డ్స్ లో పుష్పా. సినిమాకి గాను అల్లు అర్జున్కి ఈ అవార్డు దక్కింది. అయితే ఇటీవల అల్లు అర్జున్ సినిమా ఎలా ఉండబోతుంది అన్న విషయాలను కూడా తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఎన్నో మారుమూల ప్రాంతాలలోకి వెళ్లి అక్కడ ఉండే ప్రజల స్థితిగతులని తెలుసుకొనే ఎంతో ప్రామాణికమైన విలువలతో ఈ సినిమా స్టోరీని రెడీ చేశారట డైరెక్టర్ సుకుమార్.

 ఇందుకోసం చాలా రీసెర్చ్ కూడా చేశారు అని.. మన లోకల్ స్టోరీని గ్లోబల్ స్టోరీ గా తీసుకురావడానికి రాత్రి పగలు పుష్పా టీ మొత్తం పని చేస్తున్నారు అని వెల్లడించాడు ఆయన.. దాంతోపాటు పుష్పటు సినిమా వరల్డ్ లెవెల్ లో తగ్గేదే అన్నట్టు ఉంటుంది అని అల్లు అర్జున్ వెల్లడించాడు. దానితోపాటు ఈ సినిమాలో ఊహించని విధంగా ట్విస్ట్ లతో కూడిన కంటెంట్ ను రెడీ చేస్తున్నట్లుగా ఆయన తెలిపాడు. అంతేకాకుండా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడంతో పుష్పటు సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇప్పుడు ఈ సినిమాలో

ఇంటర్నేషనల్ స్మగ్లర్గా ఎదిగిన పుష్పరాజును ఢీకొట్టడం కోసం బన్వర్ సింగ్ శకావత్ ఎంతకైనా తెగించే పోలీస్ ఆఫీసర్ పాత్రలు కనిపించబోతున్నాడు. ఇక సుకుమార్ క్లైమాక్స్ ను మరింత ఆసక్తికరంగా ప్లాన్ చేశాడు అన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. అలాగే పుష్పటు సినిమాలోని కీలక పాత్రలతో పాటు కొత్త పాత్రలను కూడా పరిచయం చేస్తున్నారు అన్న సమాచారం వినబడుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఆడియన్స్ ను ఆకట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి . అలా ఇప్పుడు ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: