ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి క్రేజ్ వచ్చింది అని చెప్పాలి. త్రిబుల్ ఆర్ సినిమాలు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించినందుకు గాను ఆయనకి ఇంతటి క్రేజ్ వచ్చింది. ఇక అల్లూరి సీతారామరాజు పాత్రలు తన నటన గురించి లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ సైతం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మీద ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ ఎంత అద్భుతంగా ఉందో ఆయన మాటల్లోనే తెలియజేశారు. ఇక ఈ సినిమా తర్వాత రాంచరణ్ నటనను మరొక స్థాయిలో నిలబెట్టింది అని చెప్పాలి.
అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమాకి బోలెడన్ని అవార్డులు వచ్చాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమాలో ప్రతిభ కనబరిచిన నటీనటులు సాంకేతిక నిపుణులకు పురస్కారాలు సైతం వచ్చాయి. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న వ్యక్తిత్వం మన రామ్ చరన్ ది. ఇక ఇటీవల హైదరాబాద్ ఎయిర్పోర్టులో చెప్పులు లేకుండా నడవడం నుండి అమెరికాలో దిగడం వరకు ఆయన ప్రతి అడుగును అభిమానులు ఫాలో అవుతూనే వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాంచరణ్ నెక్స్ట్ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్.
ప్రస్తుతం ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే తాజాగా ఇప్పుడే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు సినీ వర్గంలో మరొకసారి తెగ వినబడుతోంది. ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డు అయిన పాప్ గోల్డెన్ అవార్డ్స్ కు ఇండియా నుండి బాలీవుడ్ నటుల ఆఖరి జాబితా వచ్చింది. అందులో పలువురు బాలీవుడ్ హీరోల పేర్లతో పాటు మన తెలుగు హీరో రామ్ చరణ్ పేరు కూడా ఉంది. ఇక ఆ అవార్డుకు మన రాంచరణ్ కూడా నామినేట్ అయ్యాడు..!!