తెలుగులో ఎంట్రీ ఇస్తున్న కాంతార హీరోయిన్..!!

Divya
హీరోలు ఒక ఇండస్ట్రీలో కెరియర్ మొదలు పెట్టి ఆ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఈ మధ్యకాలంలో సినిమాల తీయాలని చాలా ఆత్రుత పడుతున్నారు..అయితే హీరోయిన్లకు మాత్రం ఏదైనా సినిమా సక్సెస్ అయ్యిందంటే చాలు ఇతర భాషలలో కూడా అవకాశాలు వస్తూ ఉంటాయి.. ఇతర ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఆఫర్ తాజాగా కాంతారా హీరోయిన్ ని వరించిందని తెలుస్తోంది. తెలుగులో కూడా కాంతారా సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు..

తన మొదటి సినిమాతోనే కన్నడ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన సప్తమి గౌడ.. కాంతార చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డీ గ్లామరస్ లుక్కులో పల్లెటూరి అమ్మాయిగా అందరిని ఆకట్టుకుంది. రెండవ భాగంలో కూడా ఈమె పాత్ర చాలా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాలో సప్తమి నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి.. చాలా సహజంగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో కూడా అడుగు పెట్టబోతోంది.


కాంతారా సినిమాలో డి గ్లామరస్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ వాస్తవానికి రియల్ గా చాలా అందంగా ఉంటుంది.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సప్తమి గౌడను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో ఈమెకు మంచి పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. అలాగే అలనాటి హీరోయిన్ లయ నితిన్ అక్క పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం. ఒకవేళ తమ్ముడు మూవీ సక్సెస్ అయ్యిందంటే సప్తమి గౌడ కు తెలుగులో కూడా మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉన్నది.ఈ సినిమాతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్ర తెరకెక్కిస్తున్న వ్యాక్సిన్ సినిమాలో కూడా సప్తమి గౌడ నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: