"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది నటులు ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. వారిలో కొంతమంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈ యువ నటుడు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈ నటుడు జాతి రత్నాలు అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో నటించి ఈ మూవీ తో సూపర్ సక్సెస్ ను సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే నవీన్ తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ టాలెంటెడ్... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అనుష్క హీరోయిన్ గా నటించింది.
 


మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని తాజాగా ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో నవీన్ స్టాండప్ కమెడియన్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం వారు విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: