విజయ్ దేవరకొండ సినిమాపై.. విశ్వక్ సేన్ సెటైర్లు?
సెప్టెంబర్ నుంచి ప్రతి శుక్రవారం ఈ షో ప్రసారం కాబోతుంది అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే బయటకి కూడా వచ్చాయి. అయితే ఈ రియాల్టీ షో గురించి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని వెల్లడించడానికి.. ఇటీవలే హైదరాబాదులో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో హీరో విశ్వక్సేన్ చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ప్రస్తుతం హీరోలు అందరూ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను ప్లాన్ చేస్తుంటే.. మీరేమో ఓటిటి పోస్టుగా చేస్తున్నారు. ఇమేజ్ పరంగా మీ అభిప్రాయం ఏంటి అని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా ఆసక్తికరమైన సమాధానంచెప్పాడు.
ఇమేజ్ పరంగా మనం ఎన్నో లెక్కలు వేస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు పాన్ ఇండియా అంటూ లెక్కలు వేసి వేస్తే అది గల్లి సినిమా అవుతుంది. ఏకంగా 200 కోట్లు 300 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పుకున్న సినిమా రిలీజ్ అయ్యాక డిజాస్టర్ గా మిగిలిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఒక్కోసారి చిన్న సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. అయితే పాన్ ఇండియా మూవీస్ గా కూడా గుర్తింపు సంపాదించుకుంటాయి. నా దృష్టిలో అయితే సినిమాలపరంగా ప్లానింగ్ అంటే.. చేసుకుంటూ పోవడమే. అంటూ విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ యంగ్ హీరో ఇండైరెక్టుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా గురించే సెటైర్లు వేసాడు అని అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన లైగర్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది అన్న విషయం తెలిసిందే.