యూటర్న్ తీసుకున్న లయ !

Seetha Sailaja
న్ని సంవత్సరాలు ఒక వెలుగు వెలిగి ఆతరువాత కొంత గ్యాప్ తీసుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రంగప్రవేశం చేసి చాలమంది మాజీ హీరోయిన్స్ రాణిస్తున్నారు. రమ్యకృష్ణ ఖుష్బూ రాధిక స్నేహ ఇలా చాలమంది ఉన్నారు. వీరు కూడ భారీ పారితోషికాలు  తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ఒకనాటి హీరోయిన్ లయ కూడ చెరినట్లు వార్తలు వస్తున్నాయి.



గతంలో ఆమె నటించిన సినిమాలు సంఖ్యలో కొన్ని మాత్రమే అయినప్పటికీ నటిగా ఆరోజులలో ఆమె మంచిపేరు తెచ్చుకుంది. టాప్ హీరోలలో నందమూరి బాలకృష్ణ మీడియం రేంజ్ హీరోలలో శివాజీ తో ఆమె సినిమాలలో నటించింది. అయితే హీరోయిన్ గా ఆమె ఉన్నత స్థాయికి చేరుకోకుండానే ఆమె అమెరికాకు చెందిన ఒక డాక్టర్ ను పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది.  



ఈమె కూతురు ఆమధ్య విడుదలైన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ మూవీలో ఒక కీలక పాత్రలో నటించిన సందర్భంలో ఆ మూవీలో ఒక అతిధి పాత్రలో ఆమె నటించింది. అయితే ఆతరువాత ఆమెకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ ఆమె ఆ సినిమాలో నటించే విషయంలో పెద్దగా ఆశక్తి కనపరచలేదు అని అంటారు. కొన్ని రియాలిటీ షోలకు ఆమె జడ్జి గా వ్యవహరించింది.



ఈ నేపద్యంలో ఆమె కూడ యుటర్న్ తీసుకుని సినిమాలలోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు నితిన్ హీరోగా నటిస్తున్న ‘తమ్ముడు’ మూవీతో ఆమె మళ్ళీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ యఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో లయ హీరో సోదరి పాత్రలో కనిపిస్తుందట. ఈ మూవీకి సంబంధించిన కథలో ఆమె పాత్ర చాల కీలకం కావడంతో ఆమె ఈ పాత్రకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ చిత్రం ‘కాంతార’లో కథానాయికగా నటించి మెప్పించిన సప్తమి గౌడ ‘తమ్ముడు’ తో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: