"స్కంద" మూవీ కి జరిగిన టోటల్ బిజినెస్ వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
ఎనర్జిటిక్ నటుడు రామ్ పోతినేని తాజాగా స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. శ్రీ లీల హీరోయిన్ గ నటించిన ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను పాటలను విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండడం అలాగే ఈ సినిమా అటు రామ్ ఇటు బోయపాటి కెరీర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


అలా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా యొక్క శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను స్టార్ మా మరియు డిస్నీ ప్లేస్ హాట్ స్టార్  సంస్థలు కలిపి 53 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా ఈ మూవీ థియేటర్ హక్కులు ... మ్యూజిక్ హక్కులు కలుపుకొని మొత్తంగా ఈ సినిమాకు 150 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.


ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీపై ఉన్న అంచనాల రిత్యా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే భారీ కలెక్షన్ లు ఈ సినిమాకు దక్కే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ మూవీ తో రామ్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ ... పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: