"టైగర్ నాగేశ్వరరావు" ఫస్ట్ సింగల్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!

Pulgam Srinivas
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహిస్తుండగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 20 వ తేదీన దసరా పండుగ సందర్భంగా థియేటర్ లలో బారి ఎత్తున విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఇదే రవితేజ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
 


ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా లోని ఫస్ట్ సింగిల్ విడుదల కు సంబంధించిన అనౌన్స్మెంట్ ను ప్రకటించింది. ఈ మూవీ లోని ఫస్ట్ సింగిల్ అయినటువంటి "ఏక్ దమ్ ఏక్ దమ్" అనే సాంగ్ ను సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే రవితేజ ఆఖరుగా రావణాసుర అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. మరి రావణాసుర మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" మూవీ తో ఏ రేంజ్ లో అలరిస్తాడో తెలియాలి అంటే  మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: