సమంత కారణంగా బన్నీ పక్కన నటించం అంటున్న స్టార్ హీరోయిన్స్...!!

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ఆ విషయాన్ని ఇటీవలే ప్రూవ్ చేసుకున్నాడు. పుష్ఫ సినిమాలో నటించింనందుకు జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు బన్నీ.త్వరలో దీనిని అందుకోనున్నారు. ఈ క్రమంలో బన్నీకి అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే పుష్ప పార్ట్ వన్ లో ప్రత్యేక సాంగ్ ను పెట్టిన విషయం తెలిసిందే. ఈ పాటలో సమంత నటించి ఆకట్టుకుంది. ఈ పాట అన్ని భాషల్లో ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు పుష్ప 2లో నూ ఓ సాంగ్ పెడుతున్న విషయాన్నిసుకుమార్ ప్రకటించాడు. అయితే ఈ సాంగ్ లో బన్నీ పక్కన నటించినందుకు ముగ్గురు స్టార్ హీరోయిన్లను సంప్రదించారట. కానీ వారు ఒప్పుకోలేదు. ఎందుకంటే? పుష్ప సినిమా కథతో పాటు మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని అన్ని పాటాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రత్యేక సాంగ్ 'హు అంటావా.. మావ' అన్న సాంగ్ కుర్రకారును ఊర్రూతలూగించింది. ఇప్పటికీ ఈ పాట యూత్ ను బాగా కనెక్ట్ చేస్తోంది. ఈ క్రమంలో పుష్ప 2లోనూ ఇటువంటి పాటను పెట్టాలని అనుకుంటున్నారు. ఇందు కోసం దిశా పటానీ హీరోయిన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే అంతకుముందే ముగ్గురు స్టార్ హీరోయిన్లను సంప్రదించారట.
డైరెక్టర్ తో పాటు నిర్మాత బాలీవుడ్ కు చెందిన ముగ్గురు స్టార్ హీరోయిన్లను సంప్రదించారట. అయితే వాళ్లు బన్నీ పక్కన నటించేందుకు ఒప్పుకోలేదట. జాతీయ అవార్డు తెచ్చుకున్న బన్నీ పక్కన నటించాలని ఎవరైనా అనుకుంటారు. కానీ వాళ్లు అలా అనడానికి కారణం వేరే చెప్పారట. ఇప్పటికై పుష్ప 1 ప్రత్యేక సాంగ్ లో నటించిన సమంత పరిస్థితిని చూసి వాళ్లు ఒప్పుకోలేదట. భవిష్యత్ లో మాకు కూడా అదే పేరు వస్తుందని అనుకున్నారట. పుష్ప 1 లో ఐటెం సాంగ్ లో నటించిందుకు ఐటమ్ గర్ల్ అని పిలుస్తున్నారట. ఇది ఆనోటా.. ఈనోటా సమంత చెవిలో పడింది. దీంతో ఈ సాంగ్ లో నటించినందుకు చాలా బాధపడిందట. అందుకే తమకు ఇలాంటి పేరు వస్తుందని భయపడి ఒప్పుకోలేదట. కాని దిశా పటాని మాత్ర ఈ సాంగ్ లో నటించేందుకు ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ సీరియస్ గా షూటంగ్ జరుపుకుంటోంది. త్వరలోనే డిటేయిల్స్ బయటికి వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: