ఫ్లాప్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ మూవీ..!!
అందుకు సంబంధించి ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే ఆ తర్వాత మళ్లీ ఈ సినిమా గురించి ఎక్కడ అసలు వార్తలు వినపడడం లేదు.. దీంతో చాలామంది ఈ సినిమా ఆగిపోయిందని అనుకున్నారు.. అయితే ఈ సినిమా ఆగిపోలేదు ఇంకా అలానే ఉంది అంటూ తాజాగా ఈ సినిమా కోసం ఒక ఆఫీసును కూడా ఓపెన్ చేసినట్టు సమాచారం. ఈ రోజున పవన్ కళ్యాణ్ బర్తడే సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు
వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ సెట్ కు వెళ్లడానికి కొద్ది రోజులు సమయం పడుతుందని ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయగానే ఎన్నికలు వస్తాయి.. దీంతో పొలిటికల్ వైపుగా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టడంతో వచ్చే ఏడాది ఈ సినిమా మధ్యలో పట్టాలెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సురేందర్ రెడ్డి కూడా పక్కా స్క్రిప్ట్ తోనే ఈ సినిమాని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. సురేందర్ రెడ్డి గత సినిమా ఏజెంట్ భారీ డిజాస్టర్ ని మూట కట్టుకుంది అందుకే ఈసారి తదుపరి చిత్రాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నట్లు సమాచారం