దేవరకొండ బ్రదర్స్ కి కలిసొచ్చిన లక్కీ డైలాగ్.. అందుకే ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్..!?

Anilkumar
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటారు చాలామంది స్టార్ హీరో హీరోయిన్లు. ఆ హీరోయిన్ తో నటిస్తే సినిమా హిట్ అవుతుందని ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తే సక్సెస్ అవుతుంది అని చాలామంది భావిస్తూ సినిమాలు చేస్తూ ఉంటారు. ఇక కొందరు అయితే ఫలానా ముహూర్తం రోజే సినిమాని మొదలు పెట్టాలి అని.. ఫలానా రోజు సినిమాని రిలీజ్ చేయాలి అన్న సెంటిమెంట్లని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. దానితోపాటు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఒక క్రేజీ సెంటిమెంట్ నడుస్తుంది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికదా వైరల్ అవుతున్నాయి.

అయితే విజయ్ దేవరకొండ మార్క్ డైలాగ్ ఆ పిల్ల నాది అనే డైలాగ్ ఏ సినిమాలో చెప్తే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్ గా నమ్ముతారు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాతో ఈ డైలాగు ఎంతలా సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని తరువాత విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ సైతం బేబీ అనే సినిమాలో ఈ డైలాగ్ ని వాడడం మనం గమనించవచ్చు. అయితే ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని తర్వాత మళ్లీ విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో

సైతం ఇదే డైలాగ్ ని వాడడం జరిగింది. ఆ పిల్ల నాది అనే డైలాగ్ ని తనదైన స్టైల్ లో మార్చి చెప్పాడు విజయ్ దేవరకొండ. కాగా ఇప్పుడు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతోంది. అంతేకాకుండా విజయ్ దేవరకొండ బ్రదర్స్ కి ఈ డైలాగ్ బాగా కలిసొచ్చిందని ఈ వార్త విన్న వారందరూ రకరకాలుగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఆ పిల్ల నాది అనే డైలాగ్ చెప్తే కచ్చితంగా ఈ అన్నదమ్ముల సినిమా హిట్ అవుతుంది అన్న ట్రెండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఇప్పుడు వీరిద్దరు  అన్నదమ్ముల నెక్స్ట్ సినిమాలో కూడా ఈ డైలాగ్ ఉంటుందా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: