టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఈమెకి ఎంతలా ఫ్యాన్ ఫాలింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా నిహారికకి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది నిహారిక. సినీ ఇండస్ట్రీలో మొదట హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇక హీరోయిన్గా ఆమె చేసిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవడంతో వాటిని ఆపేసి ఇంట్లో చెప్పిన విధంగా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది.
కానీ తాను ఒకటి అనుకుంటే ఆ దేవుడు తనకి మరొకటిని ఇచ్చాడు అన్నట్లుగా జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న రెండేళ్లకే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించింది నిహారిక. అప్పటినుండి సోషల్ మీడియాలో సంబంధించిన సింగిల్ ఫోటోలని షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తోంది. దానితోపాటు ఇటీవల తన అన్నలకు రాఖీ కడుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియోలని సైతం షేర్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా నిహారిక పెట్టిన ఒక పోస్ట్ కొత్త కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది.
వి
డాకుల తర్వాత బాడీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టిన నిహారిక జిమ్ లోనే గంటలు గంటల టైం స్పెండ్ చేస్తుంది. వాటికి తగ్గట్టుగా ఫోటోలను సైతం తన అభిమానులతో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలోని రీసెంట్గా నిహారిక జిమ్లో వర్కౌంట్స్ చేస్తూ లాస్ట్ వర్కౌట్ ఇన్ హైదరాబాద్ అంటూ పేర్కొంది. అంటే నిహారిక హైదరాబాద్ లో విడిచి వెళ్ళిపోతుందా అంటూ టెన్షన్ పడుతున్నారు మెగా ఫాన్స్. ఇక ఈ వార్త విన్న తర్వాత చాలామంది విడాకుల తర్వాత మెగా ఫ్యామిలీకి నిహారికా దూరంగా ఉండబోతుంది అన్న ప్రచారం చేస్తున్నారు. ఇక విడాకుల తర్వాత నిహారికతో నాగబాబు మాట్లాడడమే మానేశారు అన్న వార్తలు కూడా వినపడుతున్నాయి. దీంతో ఈ వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!