ఖుషి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

Divya
విజయ్ దేవరకొండ ,సమంత నటించిన చిత్రం ఖుషి ఈ సినిమాని డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు.ఈ సినిమా మొదటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్ అందుకొని భారీ అంచనాల మధ్య విడుదల అయింది. మ్యూజిక్ పరంగా ట్రైలర్, టీజర్ బాగానే ఆకట్టుకున్నాయి. మొత్తానికి మొదటి రోజే చాలా ఏరియాలలో కూడా పాజిటివ్ టాక్ తో హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది ఖుషి చిత్రం. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.కానీ ఏరియా లవారిగా కలెక్షన్లు అందుకొని వివరాల్లోకి వెళితే దాదాపుగా మొదటి రోజు రూ.15.85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది.


అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 85 లక్షల రూపాయలు రాబడినట్లు తెలుస్తోంది. మిగతా భాషలలో తక్కువగానే రెస్పాన్స్ అందుకున్నది. పాన్ ఇండియా తరహాలో తమిళ్ ,హిందీ ,కన్నడ, మలయాళం వంటి భాషలలో కలుపుకొని మొదటి రోజు దాదాపుగా 45 లక్షలు వచ్చినట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా బాగానే అందుకున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.9.50 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు రాణించినట్లు తెలుస్తోంది. ఇక మొత్తం మీద 26.85 కోట్ల క్రాస్ వసూలు సాధించినట్లు సమాచారం.


ఖుషి సినిమా ఏపీ తెలంగాణలో కంటే ఎక్కువ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది మిగతా భాషలలో ఎలా ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం విజయ్ దేవరకొండ మార్కెట్ ని మరొకసారి పెంచుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల రేంజ్ లో అయితే ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది .ఈ సినిమా టార్గెట్ 53 కోట్లు అంటే దాదాపుగా ఇంకా రూ .38 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉన్నది. మరి ఏ మేరకు ఈ సినిమా ఎన్ని రోజులలో ఈ టార్గెట్ ను ఫినిష్ చేస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: