టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా తో పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.ఇక ఇటీవల ఆయన నటించిన ధమాకా మరియు వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకోవడంతో ప్రస్తుతం ఖుషి ఖుషీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే దాని తర్వాత వచ్చిన రావణాసుర సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ మళ్లీ తాజాగా ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మాస్ మహారాజ రవితేజ కెరియర్ లోనే మొదటి పీరియాడిక్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇక రవితేజ కి సంబంధించిన సినిమాలు వరుసగా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకదాని తరువాత మరొకటి సెట్స్ పైకి వెళుతున్నాయి. సంక్రాంతికి ఈగల్ అనే మరొక సినిమా దాని తరువాత గోపీచంద్ మలినేని తో ఇంకొక సినిమా అలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెడుతున్నాడు రవితేజ. ఇక ఎప్పుడు షూటింగ్ లు సినిమాల హడావిడి కాకుండా ఫ్యామిలీతో కూడా కలిసి టైం స్పెండ్ చేస్తూ ఫారిన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు మాస్ మహారాజా.
ఈ నేపథ్యంలోనే షూటింగ్స్ కి గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు. తన ఫ్యామిలీతో కలిసి జపాన్ కి ఎంజాయ్ చేయడానికి బయలుదేరాడు రవితేజ. సాధారణంగా రవితేజ తన ఫ్యామిలీ ఫోటోలని ఎక్కడా కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది లేదు. ఎప్పుడో ఒకసారి గాని తన కుటుంబాన్ని చూపించడు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. టోక్యో నుండి తనకీ తన కుటుంబానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అవి కాస్త ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..!!