అలాంటి పదవిని కైవసం చేసుకున్న సీనియర్ హీరో మాధవన్....!!

murali krishna
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ఆర్. మాధవన్  గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఇకపోతే ఆర్ మాధవన్ తాజాగా ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ,పాలకమండలి చైర్మన్ గా నామినేట్ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ నటుడికి తన శుభాకాంక్షలు వెల్లడించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కేంద్ర మంత్రి ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. మరోవైపు జాతీయ అవార్డు గెలిచిన నటుడికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇకపోతే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గా నామినేట్ అయినందుకు సోషల్ మీడియా వేదికగా కేంద్రం మంత్రి ఆర్ మాధవన్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అపారమైన అనుభవం ఈ ఇన్స్టిట్యూట్ ను సుసంపన్నం చేస్తుందని.. సానుకూల మార్పులను తీసుకువస్తుందని.. ఉన్నత స్థానానికి తీసుకువెళ్తాయని తాను భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.ఇక విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాధవన్ స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ సినిమాకి గాను తాజాగా జరిగిన 69వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది.

మొత్తానికి అయితే అటు అధ్యక్షుడిగా, ఇటు జాతీయ అవార్డు అందుకున్న నటుడిగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు మాధవన్. ఇక మాధవన్ విషయానికి వస్తే.. సినీ నటుడి గానే కాకుండా నిర్మాతగా, రచయితగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఇటీవల డైరెక్టర్ గా కూడా పేరు దక్కించుకున్నారు. ఇక ఆయన తన నటనతో రెండు ఫిలింఫేర్ అవార్డులను అలాగే తమిళనాడు రాష్ట్ర ఫిలిం పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నారు.

ఇక దాదాపు ఏడు భాషా సినిమాలలో నటించిన అతి తక్కువ భారతీయ నటుల్లో ఒకరిగా నిలిచిన మాధవన్ కెరియర్ మొదట్లో టీవీ సీరియల్స్ లో కూడా చిన్న చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తర్వాత ఎన్నో యాడ్స్ లో కూడా నటించిన ఈయన మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా అలై పాయుదే ఆయన కెరియర్ ను పెద్ద మలుపు తిప్పిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: