తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ తో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితమే జాతి రత్నాలు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ ... స్వప్న సినిమాస్ బ్యానర్ వారు నిర్మించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా నవీన్ పోలిశెట్టి కి కూడా అద్భుతమైన గుర్తింపును తీసుకువచ్చింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నవీన్ స్టాండప్ కమెడియన్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇకపోతే ఈ సినిమాను యూ వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు నిర్మించారు. ఈ మూవీ ని సెప్టెంబర్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమాలో హీరోగా నటించినటువంటి నవీన్ పోలిశెట్టి వరుసగా ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈ రోజు కూడా ఈ నటుడు ఒక ఏరియాలో అదిరిపోయే రేంజ్ లో ప్రమోషన్ నిర్వహించబోతున్నాడు. ఇకపోతే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు నవీన్ పోలిశెట్టి శరత్ సిటీ క్యాపిటల్ మాల్ "ఏ ఎం బి" హైదరాబాదులో జనాలతో ఇంటరాక్ట్ కానున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.