ఈసారి సంక్రాంతి ఓవర్ లోడ్ కానుందా..?

Pulgam Srinivas
ప్రతిసారి సంక్రాంతి పండగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అందుకు ప్రధాన కారణం ఎక్కువ శాతం సంక్రాంతి పండుగకు స్టార్ హీరోలు నటించిన సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఇకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతికి కూడా స్టార్ హీరోలు నటించిన సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. కాకపోతే ఈ సారి కాస్త ఎక్కువ సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.


తేజా సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న హనుమాన్ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కూడా ప్రకటించింది. ఈ రెండు మూవీ లతో పాటు ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఈగల్ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం నా సామి రంగ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు.


ఇకపోతే చిరంజీవి , కళ్యాణ్ కృష్ణ కాంబోలో తెరకెక్కబోయే సినిమాను కూడా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలి అనే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమాని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. కాకపోతే ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసి వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ లు అన్నీ కనుక వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినట్లు అయితే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్ లోడ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: