షారుక్ జవాన్ రిజల్ట్ కోసం.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్?
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేసింది అని చెప్పాలి. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ అవుతూ ఉంది అని చెప్పాలి. అయితే షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా రిజల్ట్ గురించి అటు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాడట. అదేంటి షారుక్ సినిమా రిసల్ట్ గురించి అల్లు అర్జున్ ఎదురు చూడటం ఏంటి.. ఆయనకేంటి సంబంధం అనుకుంటున్నారు కదా. అయితే పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ఇక బన్నీ ఎంచుకునే కథలలో ఎంతో మార్పు కనిపిస్తుంది.
తనకు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ను కాపాడుకునే విధంగా సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. పుష్ప 2 తర్వాత లైన్ ఆఫ్ సెట్ చేసుకుంటున్నాడు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగతో సినిమాలు చేయబోతున్నాడు. అదే సమయంలో కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమా చేయాలని అల్లు అర్జున్ అనుకుంటున్నారట. ఇక కొన్ని రోజుల క్రితమే అల్లు అర్జున్ కు అట్లీ ఒక కథ చెప్పాడట. ఇక ఇప్పుడు షారుక్ తో తీసిన జవాన్ రిజల్ట్ చూసిన తర్వాత డైరెక్టర్ అట్లీతో సినిమా చేయాలా వద్దా నిర్ణయించుకుంటాడట అల్లు అర్జున్.