బిగ్ బాస్ 7 : ఇదెక్కడి ట్విస్ట్ సామి.. మైండ్ బ్లాక్ అయింది?

praveen
ప్రేక్షకులు అందరికీ తెలిసిన సినీ సెలబ్రిటీలను ఒక హౌస్ లో ఉంచడం.. ఇక వారికి టాస్కులు ఇచ్చి గేమ్స్ ఆడించి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచడం.. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగానే ఇక ఎలిమినేషన్లు ఇక విజేతను ప్రకటించడం అటు బిగ్ బాస్ కార్యక్రమంలో కనిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే దాదాపు 6 సీజన్ల నుంచి ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పుడు ఏడవ సీజన్ తో అలరించేందుకు సిద్ధమైంది. అన్ని భాషల కంటే తెలుగులోనే ఈ షో సూపర్ సక్సెస్ అయింది అన్న విషయం తెలిసిందే.


 అయితే కొన్ని కొన్ని సార్లు అంతా రెగ్యులర్ ఫార్మాట్లో ప్రతి సీజన్ ఉంటుందంటే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నిర్వాహకులు  ఈసారి కొత్తగా ప్లాన్ చేశారు. ఉల్టా పుల్టా అంటూ ప్రేక్షకులు అంచనాల పెంచేశారు. అయితే ముందు ఇలాగే చెప్తారు తర్వాత అంతా ముందు సీజన్లో లాగే ఉంటుందని కొంతమంది విమర్శలు కూడా చేశారు. కానీ ఈసారి నిజంగానే అంతా ఉల్టా పుల్టా ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా మొదటి ఎపిసోడ్ నిలిచింది. బిగ్బాస్ హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్  కన్ఫార్మ్ కావాలంటే ఆడి సాధించుకోవాలి అంటూ చెప్పాడు.


 కూర్చునే చైర్ల దగ్గర నుంచి పడుకునే బెడ్ వరకు కూడా ఇలా గేమ్స్ ఆడి సంపాదించుకోవాలని ట్విస్ట్ ఇచ్చాడు. ఇక అంతకు మించిన మైండ్ బ్లాక్ అయితే ట్విస్ట్ మరొకటి ఇచ్చాడు. సాదరణంగా బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లకు కొంత మొత్తంలో మనీ ఆఫర్ చేయడం చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు మొదటి ఎపిసోడ్ లోనే ఏకంగా డబ్బులు ఆఫర్ చేశాడు. ఐదు లక్షల నుంచి మొదలుపెట్టి 35 లక్షల వరకు పెంచేశాడు నాగార్జున. ఈ ట్విస్ట్ తో అందరి మైండ్ బ్లాక్ అయింది అని చెప్పాలి. అయితే నాగార్జున 35 లక్షలు ఆఫర్ చేసిన ఇక హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ వద్దు అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: